తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు.. కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో ఆయన మొదటివిడత యాత్ర ముగియనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్న ఈ యాత్రలో.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు సంజయ్. పార్టీ ఎక్కడ బలంగా ఉంది స్థానిక నాయకుల పరిస్థితి ఏంటీ అనే క్లారిటీకి వచ్చారు అవినీతి, నియంతృత్వం, కుటుంబపాలన నుంచి విముక్తి కోసమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
తెలంగాణ ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయని, బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘2023లో తెలంగాణలో భారతీయ జెండాను ఎగురవేస్తాం. నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా.. తెలంగాణలో ధర్మం గురించి పాటుపడతానని బండి సంజయ్ తెలిపారు. దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణలో సర్పంచులు పరిస్థితి ఎలా…
ప్రజా సంగ్రామ యాత్రలో అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే మెడలు వంచుతాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. మంచి జరిగితే రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రంది అంటారంటూ ఫైర్ అయిన ఆయన.. లీటర్ పెట్రోల్‌పై రూ.26 వ్యాట్ , రూ. 14 టాక్స్ తీసుకుంటున్నారని.. మళ్లీ…
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా?…
రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ లో భాగంగా… ఇవాళ గన్ పార్క్ కు వచ్చారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ఆదర్శం గా ఉంటుందని… కేటీఆర్ ముందుకు వస్తే ఆయన స్థాయి మరింత పెరిగేదని అభిప్రాయ పడ్డారు.రాజకీయ నాయకుడు స్థాయి గురించి మాట్లాడితే .. కేటీఆర్ పతనం మొదలైనట్లేనన్నారు. ”ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన సవాల్ ను.. నీ స్థాయి..నా స్థాయి అని అనడం అంటేనే…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పీకింది ఏమీ లేదని… కేంద్రంలో కూడా పీకింది ఏమీ లేదన్నారు. ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశంలో 78 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ కేంద్రం…
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం…
సీఎం కెసిఆర్ రాజకీయ జీవితం సమాధి చేస్తామని….కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడేది లేదని… అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని… ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారని మండిపడ్డారు. విమోచన దినోత్సవాన్ని ఎందుకు…
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాట్ టాపిక్ అయ్యింది.. ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో సవాల్ చేసిన ఆయన నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు.. అయితే, దీనికి అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ వస్తే…