బనగానపల్లెలో టిడిపి, వైసిపి పోరు పొగలు సెగలు రేపుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరస్పర ఆరోపణలు ఒకవైపు, కాటసాని అనుచరుడి కిడ్నాప్, మరో అనుచరునిపై దాడి ఘటనలతో పరిస్థితి చేయిదాటి పోయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయట. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి ఆచారి పై టిడిపి కార్యకర్తలు…
టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ కుమారుడి వివాహంలో వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నాకు సిద్ధమయ్యారు. శివనంది నగర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసం…
గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ తప్ప.. వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ డ్రైనేజీ పనులు కూడా చేయ లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. జుర్రెరు వాగు నీరు కలుషితం కాకుండా 30 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం అని మంత్రి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ.30.66…
బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకోగా.. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.. గెలుపే దిశగా మరో ముందడుగు వేశారు.. ఈ రోజు కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
గొర్విమానిపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డితో పాటు అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వార్డు మెంబెర్లు, కీలక నాయకులు, కార్యకర్తలు బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడి రూటే సెపరేట్.. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే అంతే.. సొంతంగా ఎంత ఖర్చైనా పర్లేదు.. ప్రజల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేసి తీరాల్సిందే అని పంతం పడతారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.