నంద్యాల జిల్లాలోనే మోస్ట పొలిటికల్ హాటెస్ట్ సెంటర్ బనగానపల్లె నియోజకవర్గం. అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ప్రతిపక్ష టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మధ్య ఎత్తులకు పై ఎత్తులు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో బనగానపల్లె రాజకీయం రోజురోజుకు మండే ఎండలను మించి హీటెక్కిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో బీసీపై స్వల్ఫ తేడాతో గెలిచి కాటసాని పై చేయి సాధించగా.. ఈసారి కాటసాని రామిరెడ్డిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని బీసీ జనార్థన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అంతే కాదు కాటసాని బంధువులను టీడీపీలో చేర్చుకుని తన సొంత ఇలాకా అవుకులో క్యాడర్ ను ఖాళీ చేసే పనిలో పడ్డారు. అటు చల్లా వర్గీయులు, ఇటు కాటసాని కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు.
Read Also: నాలుగు పదులు వయసులోనూ గ్లామర్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రియ
అయితే, మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని కాటసాని రామిరెడ్డి భావిస్తున్నారు. కానీ, ఎన్నికలకు ముందు అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లోని కాటసాని రామిరెడ్డి సన్నిహితులను బీసీ జనార్థన్ రెడ్డి సైకిలెక్కిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన అవుకు మండలంలోని వైసీపీ నేతలను వరుసగా టీడీపీ గూటికి చేరుతున్నారు. కొద్ది నెలల క్రితం కాటసాని రామిరెడ్డి, ఓబుల్ రెడ్డిల చిన్నచూపుతో పదేళ్లుగా అవుకు మండలంలో వాళ్ల గెలుపు కోసం కష్టపడి పని చేసిన యువనేత కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు.
Read Also: Uttarakhand: గర్జియా మాత ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం
అలాగే, తాజాగా కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. 15 రోజులుగా అవుకు మండలంలో కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితులైన చల్లా విజయ భాస్క్ రెడ్డి, వంగాల పరమేశ్వర్ రెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, మెట్ల రామిరెడ్డి వంటి వైసీపీ అగ్రనేతలు తెలుగుదేశం పార్టీలో చేరి బీసీని గెలిపించేందుకు రంగంలోకి దిగడంతో వైసీపీ క్యాడర్‌లో ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు ఎన్నికల ముందు వైసీపీ కీలక నేతలు బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా సైకెలెక్కడంతో టీడీపీ క్యాడర్‌లో కదనోత్సాం నెలకొంది.