BC Janardhan Reddy: బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో పలువురు చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులి వచ్చింది.. మేక చచ్చింది.. ఈ డైలాగ్ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన బనగానపల్లె నియోజకవర్గానికి కరెక్ట్‌గా సూట్ అవుతోంది. ఈసారి బనగానపల్లె కోటపై ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎన్నికల క్షేత్రంలోకి దూకి పెద్దపులిలా పంజా విసురుతూ వేట మొదలు పెట్టారు. తాజాగా కొలిమిగుండ్లలో కీలక నేత బీసీ జనార్థన్ రెడ్డికి తోడుగా వచ్చి చేరాడు.
Read Also: Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఇద్దరూ తోడు దొంగలు..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
నంద్యాల జిల్లాలోనే మోస్ట్ హాటెస్ట్ పొలిటికల్ సెంటర్.. బనగానపల్లె. ఇక్కడ మండే ఎండల కంటే. ఎక్కువగా రాజకీయం మంటలురేపుతూనే ఉంటుంది. గత ఎన్నికల్లో సొంత పార్టీలో వెన్నుపోట్లతో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరవేయాలని ఫిక్స్ అయ్యారు. కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిలెక్కుతుంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అత్యంత పన్నిహితుడైన కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, చల్లా విజయ్ భాస్కర్ రెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, మెట్ల రామిరెడ్డి తదితర అగ్రనేతలు టీడీపీలో చేరి క్షేత్రస్థాయిలో అహర్నిశలు ప్రచారం చేస్తూ బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.
Read Also: T. Rajaiah: కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి
అయితే, తాజాగా కొలిమిగుండ్ల మండలంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గొర్విమానిపల్లిలో జరిగిన చేరికల కార్యక్రమంలొ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు, గొర్విమానిపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డితో పాటు అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వార్డు మెంబెర్లు, కీలక నాయకులు, కార్యకర్తలు బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పులిప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాటసాని రామిరెడ్డి నమ్మక ద్రోహనికి మారుపేరు అంటూ మండిపడ్డారు. గత ఐదేళ్లుగా బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు.. కాటసాని రామిరెడ్డికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ కార్యకర్తల మీద, బనగానపల్లె ప్రజల మీద లేదన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షతులై, బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్థన్ రెడ్డి రూ. 1800 కోట్లతో అభివృద్ధిపరిచారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించుకుతీరుతామని పులి ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కాగా, టీడీపీలో చేరిన పులి ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, కార్యకర్తల చేరికను బీసీ జనార్థన్ రెడ్డి స్వాగతించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..