BC Janardhan Reddy: నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడి రూటే సెపరేట్.. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే అంతే.. సొంతంగా ఎంత ఖర్చైనా పర్లేదు.. ప్రజల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేసి తీరాల్సిందే అని పంతం పడతారు.. విశ్వసనీయత, మాట తప్పడం, మడమ తిప్పడం అంటూ కబుర్లు చెప్పడం కాదు.. నిజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ప్రజల విశ్వాసం చూరగొనడంలో ఆయనకు ఆయనే సాటి.. తన సేవాగుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.
Read Also: Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..
ఓట్ల కోసం ప్రజలకు వల్లమాలిన హామీలు ఇస్తూ.. తీరా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ప్రజలను గాలికి వదిలేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు ఉన్న ఈ కాలంలో రాజకీయాలకు అతీతంగా, పదవుల్లో ఉన్నా లేకున్నా.. ప్రతి నిత్యం తన నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ.. సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం.. అభ్యాగ్యులకు అండగా నిలబడుతున్న నిస్వార్థ ప్రజాసేవకుడిగా బనగానపల్లె ప్రజల గుండెల్లో టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. తాజాగా బనగానపల్లె నియోజకవర్గంలో దివ్యాంగులకు భరోసాగా నిలిచి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
Read Also: Uttar Pradesh: అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి..
గత కొన్నాళ్లుగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా గ్రామగ్రామానా విస్తృతంగా పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి పలువురు దివ్యాంగులు ట్రై సైకిళ్లు లేక పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వారికి తన సొంత డబ్బులతో ట్రై సైకిల్ కొని ఇస్తానని, జీవనోపాధికి తగిన సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ (మార్చి 7) బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సొంత డబ్బులతో ట్రై సైకిళ్లు కొనుగోలు చేసి 12 మంది దివ్యాంగులకు ఉచితంగా అందించి మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. మాట తప్పి, మడమ తిప్పే నాయకులను చూస్తున్న ఈ కాలంలో మాట ఇచ్చి, నెరవేర్చిన నిఖార్సైన నాయకుడిగా బనగానపల్లె ప్రజల గుండెల్లో చెరగని సంతకంలా.. తనదైన ముద్ర వేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.