మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో కొన్ని భూకబ్జాలు అయిన విషయంపై విచారణ చేయమని చెప్పాను.. దీని పై సిట్ వేశారు.. గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నాపై విమర్శలు వచ్చాయి.. విచారణ వేగంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ, కలెక్టర్ ను అడిగాను అని ఆయన అన్నారు.
Off The Record: ప్రకాశం జిల్లాలో వైసీపీ మీద గట్టి పట్టున్న నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారాయన. అయితే గత మంత్రివర్గ విస్తరణ సమయం నుంచి జరుగుతున్న పరిణమాలు ఆయనను అంతర్మధనంలో పడేశాయి. సొంత వాళ్లే గోతులు తీస్తున్నారంటూ విరక్తితో సైలెంటై పోయారు. అయితే… ఇటీవల పర్యటనకు వచ్చిన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాలో ఇక నుంచి అంతా బాలినేని చేతుల మీదుగానే…
ప్రకాశం జిల్లా ప్రజలంతా మాగుంట కుటుంబానికి అండగా నిలబడాలని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆయన అన్నారు.
Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి…