ప్రకాశం జిల్లాలో భూ కబ్జాల వ్యవహారం సీఐడీకి ఏపీ ప్రభుత్వం రిఫర్ చేయనుంది అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గన్ మ్యాన్ లను సరెండర్ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.. వారు డ్యూటీలో చేరారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో కొన్ని భూకబ్జాలు అయిన విషయంపై విచారణ చేయమని చెప్పాను.. దీని పై సిట్ వేశారు.. గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నాపై విమర్శలు వచ్చాయి.. విచారణ వేగంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ, కలెక్టర్ ను అడిగాను అని ఆయన అన్నారు.
Read Also: Kerala Politics: ‘బీజేపీతో పొత్తుకు పినరయి విజయన్ గ్రీన్‌సిగ్నల్’.. మాజీ ప్రధాని ప్రకటనపై దుమారం
వైసీపీ వాళ్ళు ఉన్నా విచారణ చేయమని చెప్పాను అని మాజీమంత్రి బాలినేని తెలిపారు. వాళ్ళు సరిగ్గా స్పందించక పోవటం వల్ల మనస్తాపం చెందాను.. నాపై తప్పుడు ప్రచారం వెనుక పార్టీలోని కొంత మంది హస్తం ఉంది.. దమ్ముంటే ప్రత్యక్షంగా పోరాడాలి.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించను.. నాపై వచ్చిన తప్పుడు వార్తలపై విచారణ చేస్తాం అని ధనుంజయ్ రెడ్డి చెప్పారు.. మరోసారి ఇలా చేస్తే ఊరుకోను అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా తర్వాత సీఎం జగన్ ను కలిసి ఈ విషయాలు అన్నీ చెబుతాను.. నన్ను దొంగ చాటుగా దెబ్బ తీయాలని పార్టీలోని వారే కుట్రలు పన్నుతున్నారు అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Michelle Marsh: బర్త్ డే ఇన్నింగ్స్.. గుర్తిండిపోయే రోజు ఇదే
ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పోరాడాలి.. నేను సీఎంకు ఆత్మ బంధువుగా వ్యవహరించాను అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి వచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నాపై ఒత్తిడి చేశారు.. సోనియా గాంధీని కలుద్దాం అన్నారు.. అలా చేయటం తప్పని నేనే ఆయనను వారించాను అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.