Off The Record: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటంపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాది క్రితం జరిగిన క్యాబినెట్ విస్తరణలో మళ్లీ తనకు చోటు దక్కలేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బాలినేని. ఆయన అనుచరులు హంగామా చేయటం, సజ్జల లాంటి వ్యక్తి బాలినేని ఇంటికి రెండు మూడు దఫాలు తిరిగి బుజ్జగించటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్…
Balineni Srinivasa Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు బాలినేని.. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్‌లో ఉన్నారు బాలినేని.. కాగా, ఆయన రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. అయితే, సీఎం వైఎస్ జగన్ తొలి…
మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి.. మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు.
Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు ప్రయత్నించినా…
Balineni Srinivasa Reddy: నెల్లూరు జిల్లా పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. తాజాగా, నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు కోటంరెడ్డి.. అయితే, కోటంరెడ్డికి కౌంటర్ ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.. వైసీపీ…