Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్…
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో కూడా పెద్దగా పరియం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ అన్న పేరుంది ఆయనకు. దాదాపు పది నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించింది.
బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్‌లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే…
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల మధ్య వార్ కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అందరూ వైసిపి కార్పొరేటర్లే అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.
ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర చోట్ల కూడా వైసీపీకి అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు. ప్రస్తుతం ఆ పార్టీకి బైబై చెప్పేసి జనసేనలో ఉన్నారు. గత ఐదేళ్లలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్‌హాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం కలసి రాలేదు. అలకలు, బుజ్జగింపుల పర్వంతోనే పుణ్యకాలం గడిచిపోయింది.
ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
JanaSena: ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ మొదలైంది.. ఒంగోలు చర్చి సెంటర్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, వాళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు.. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను…