నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్.. త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10…
ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారన్న ఆయన.. అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారన్నారు.
అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశాం.. ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అని ఆరోపించారు. భూములకు నాకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.. ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
టీడీపీపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయని ఆరోపించారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నామని.. ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని బాలినేని తెలిపారు.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెండు వైపులా.. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరు గెలిస్తే బాగానే ఉంటుంది.. ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు.. ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అంటారని అన్నారు. తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప.. పార్టీలో ఉండి ఏది చేయనని తెలిపారు. వైఎస్సార్ తమకు ఒకటే నేర్పించాడని.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లి…