Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా ప్రజలంతా మాగుంట కుటుంబానికి అండగా నిలబడాలని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా మాగుంట మౌనంగా వెళ్తూ ఈజీగా తీసుకోవటం కరెక్ట్ కాదని తన భావన అంటూ ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికలు అంత ఈజీగా ఉండవు, మేము కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఒంగోలులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి జన్మదిన వేడుకల్లోమాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Srisailam: శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచారం
2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ బరి నుంచి మాగుంట ఉంటారో.. ఆయన కుమారుడు ఉంటారో ఆయన ఇష్టమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈసారి కూడా 2024 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ తగ్గకుండా చూడాలని ప్రజలను కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వారి డబ్బు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కుటుంబం మాగుంట కుటుంబమని ఆయన తెలిపారు.
గత రెండేళ్లుగా తమ కుటుంభానికి ఎదురైన ఇబ్బందుల వల్ల పుట్టినరోజు జరుపుకోలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 70 ఏళ్ల జీవితంలో మా కుటుంబం ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదన్నారు. మా కుమారుడు రాఘవరెడ్డి కూడా చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన వెల్లడించారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మా కుమారుడు రాఘవరెడ్డి బరిలో ఉంటారు.. అందరూ ఆశీర్వదించాలని ఆయన చెప్పారు.