Veera Simha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కారణం నటసింహం తాజా చిత్రం వీరసింహారెడ్డి నుంచి ఇటీవల రిలీజైన సుగుణ సుందరి పాట ఓ రేంజ్లో దూసుకుపోతుంది.
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.…
‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర…
ఒక భాషలో హిట్ అయిన ఒక సినిమాని ఇతర భాషల్లో రీమేకులు చేయడం మాములే. అయితే కొన్ని సినిమాలని మాత్రం రీమేక్ చేయకుండా అలానే వదిలేయాలి లేదా డబ్ చేసి అయిన రిలీజ్ చేయాలి. పొరపాటున రీమేక్ చేస్తే, ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనే విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక రీమేక్ చేయకూడని సినిమానే ‘అఖండ’. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’…
ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయాలంటేనే కష్టం, అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి అంటే…
Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు.
యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది చివర్లో ‘అఖండ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన మరోసారి…
ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం వున్నా.. అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. యాభై వేల మంది వచ్చిన మహానాడు ప్రజా విజయం కాదు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారన్నారు. మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి.…
నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు. వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా…