నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని,…
ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్‌లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
ఉప్పు..నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాల మధ్య రెండున్నర దశాబ్దాలుగా సఖ్యత లేదు. పేరుకు తోడల్లుళ్లు అయినా.. ఎవరి రాజకీయం వారిదే. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. ఇటీవలే ఆ ఇద్దరు ఓ కార్యక్రమంలో కలుసుకుని.. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. సంక్రాంతి పండక్కి చాలాఏళ్ల తర్వాత ఓ అక్క ఇంటికి తమ్ముడొచ్చాడు. ఆ తమ్ముడి సందడి సంక్రాంతికే పరిమితమా.. లేక ఇద్దరు బావలను కలపటం కోసమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో…
సినిమా టికెట్ల ధరల విషయంలో ఆ ఎమ్మెల్యే సొంతపార్టీ హీరోనూ బుక్ చేశారా? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో పార్టీ ఉండగా.. ఆయన కామెంట్స్ టీడీపీ శిబిరాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయా? తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సినిమా టికెట్ ధరలపై టీడీపీ నేతల ఆసక్తికర కామెంట్స్‌సినిమా టిక్కెట్ల వ్యవహారం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్. టిక్కెట్ రేట్లు మొదలుకుని.. థియేటర్ల సీజ్ వరకు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన…
నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్ఫామ్లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. సింహ, లెజెండ్ చిత్రాల తరువాత వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అంచనాలను మించి నేడు విడుదలైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని కలక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇక అఖండ భారీ విజయాన్ని అటు అభిమానులే కాకుండా ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి…
చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన బాలయ్య కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు… మీడియా ముందుకు వచ్చిన బాలయ్య కుటుంబం… వైసీపీపై ఫైర్ అయింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ అస్సాసినేషన్ మంచిదికాదని మండిపడ్డారు బాలయ్య. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆగ్రహించారు బాలకృష్ణ. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్ని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. ఇకనైనా వైసీపీ తన పద్దతిని మార్చుకోవాలన్నారు. మీరు మారక…
పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారిదే పైచేయి. అంతకు ముందు, ఆ తరువాత ఎందరు పౌరాణిక చిత్రాలు తీసి విజయాలు సాధించినా, పురాణగాథలతో తెరకెక్కిన తెలుగువారి చిత్రాల ముందు వెలవెల బోయాయనే చెప్పాలి. ఇక మన తెలుగు చిత్రసీమ పౌరాణిక చిత్రాలలో నిస్సందేహంగా ‘శ్రీలలితా శివజ్యోతి’ వారి పంచవర్ణ చిత్రం ‘లవకుశ’ అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ 1963 మార్చి 29న వెలుగు చూసింది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ‘లవకుశ’ చరిత్ర…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ చిత్రంలో నటించాల్సి ఉంది. బాలకృష్ణ నటిస్తున్న ఈ 107వ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 10.26 నిమిషాలకు సినిమాను ప్రారంభిస్తున్నట్టు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలిపారు. ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని, బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను…