సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ‘జై బాలయ్య’ అంటూ బయటకి వచ్చిన సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ఇచ్చిన జోష్ తో ‘వీర సింహా రెడ్డి’ ప్రమోషన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. అయితే ‘జై బాలయ్య’ ఇచ్చిన జోష్ ని చిత్ర యూనిట్ కంటిన్యు చెయ్యడంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు ఉన్నారు.
‘వీర సింహా రెడ్డి’ సినిమా రిలీజ్ కి ఇంకో నెల రోజుల సమయం మాత్రమే ఉంది, మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ జోష్ ని కంటిన్యు చేస్తే ‘వీర సింహా రెడ్డి’ సినిమా భారి ఓపెనింగ్స్ ని రాబట్టడం గ్యారెంటీగా జరిగేది. ఈ పాయింట్ కి మిస్ చేస్తున్న చిత్ర యూనిట్, ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ‘జై బాలయ్య’ పాట వచ్చిన వారం రోజుల్లోనే సెకండ్ సాంగ్ ‘సుగుణ సుందరి’ని రిలీజ్ చేసి ఉంటే ఆడియన్స్ లో జోష్ ఎక్కువ అయ్యేది. రెండు పాటల మధ్య దాదాపు రెండు వారాల గ్యాప్ ఉండడంతో సినీ అభిమానుల దృష్టి కాస్త వేరే సినిమపైకి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. గోపీచంద్ మలినేని అండ్ టీం ఈ జాగ్రత్త తీసుకోని ఇకపై అయినా ‘వీర సింహా రెడ్డి’ నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ లో ఇప్పటికే ఉన్న హైప్, రిలీజ్ డేట్ వరకూ క్యారీ ఫార్వడ్ అవుతుంది.