NBK107 First Hunt: బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ట్రీట్.. పవర్‌ఫుల్ పోస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది చివర్లో ‘అఖండ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు.
‘అఖండ’ మూవీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొన్ని నెలల క్రితమే ‘క్రాక్’ అనే సినిమాతో సక్సెస్‌ను అందుకున్న గోపీచంద్ మలినేనితో సినిమాను ప్రకటించారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. దీనికోసం గోపీచంద్ లైబ్రెరీలలో ఉన్న పాత సంఘటనలను కూడా ఆధారంగా తీసుకున్నాడు.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఇది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది.
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇందులో బాలయ్య తెల్ల పంచె, నలుపు రంగు షర్ట్‌తో పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఇది ఫ్యాన్స్‌కు మరోసారి ఫుల్ మీల్స్ పెట్టే చిత్రం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. పబ్లిక్ ప్లేస్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: ఫ్యాన్స్ తట్టుకోనంత దారుణంగా! నటసింహా నందమూరి బాలకృష్ణ జూన్ 10న పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పురస్కరించుకుని గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమా నుంచి NBK107 First Hunt పేరుతో టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే దీన్ని జూన్ 9న విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ఇక, తాజాగా ఈ టీజర్‌ను ఈరోజు సాయంత్రం 6:11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా వదలారు. అందులో ‘పులిచర్ల 4 కి.మీ’ అనే రాయిపై రక్తపు మరకలు, దాని పక్కనే స్పెషల్‌గా డిజైన్ చేసిన గొడ్డలిని చూపించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ ఇచ్చే ట్రీట్ రాబోతుందని అర్థం అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!