‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ అయ్యాకే #NBK108 సినిమా మొదలవుతుంది అనుకుంటే స్పీడ్ పెంచిన బాలయ్య డిసెంబర్ 8నే #NBK108 సినిమాని స్టార్ట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అనిల్ రావిపూడి బాలయ్యతో చేయనున్న సినిమాలో హీరోయిన్ గా ‘ప్రియాంక జవాల్కర్’ ఫైనల్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి ‘ప్రియాంక జవాల్కర్’ మొదటి సినిమాతోనే ఆడియన్స్ దృష్టిలో పడింది. రీసెంట్ గా ‘SR కళ్యాణమండపం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియాంక జవాల్కర్, తన నడుము అందాలతో అభిమానులని ఊరిస్తూ ఉంటుంది. ప్రియాంక జవాల్కర్ ఫోటోలకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకూ యంగ్ హీరోల పక్కనే నటించిన ప్రియాంక జవాల్కర్ కి ‘NBK 108’ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ మూవీ హిట్ అయితే తెలుగు అమ్మాయికి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.