Nandamuri Fans: ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’ చేసారు… ఇదెక్కడి అరాచకం మావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ‘జై బాలయ్య’ అనేది నందమూరి అభిమానులు సరదాగా చెప్పుకునే మాట. ఇప్పుడు ‘జై బాలయ్య’ అనేది సెలబ్రేషన్స్ కే స్లోగన్ లా మారిపోయింది. ఏ హీరో ఫంక్షన్ జరిగినా, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా, ఎక్కడ పది మంది కలిసి కూర్చున్నా, ఏదైనా పబ్ కి వెళ్లినా తప్పకుండా వినిపించే ఒకేఒక్క స్లోగన్… ‘జై బాలయ్య’. ఇలాంటి సీన్ ఒకటి డల్లాస్ లో జరిగింది. ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’గా మారుతూ నందమూరి ఫాన్స్ రచ్చ రచ్చ చేసారు. క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవ్వడంతో, డల్లాస్ లోని కొందరు తెలుగు వాళ్లు ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. తెలుగోడు ఎంజాయ్ చెయ్యాలి అంటే జై బాలయ్య నినాదం ఉండాల్సిందే కదా. డల్లాస్ రెస్టారెంట్ లో జరిగింది కూడా ఇదే. ఆ రెస్టారెంట్ లో ఉన్న Djలో బాలయ్య నటించిన ‘అఖండ’ మూవీ ‘జై బాలయ్య’ సాంగ్ ని పెట్టుకోని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.
బాలయ్య ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. తెలుగోడు ఎక్కడ ఉన్నా తెలుగోడే, బాలయ్య ఫాన్స్ మాస్ సెలబ్రేషన్స్ అంటే ఏంటో చూపించారు, డల్లాస్ ని డల్లాస్ పురంగా మార్చేశారు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డల్లాస్ ని బాలయ్యకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘డల్లాస్ బాలయ్య యువసేన’ అనే అసోషియేషన్ ని నందమూరి అభిమానులు రన్ చేస్తున్నారు. బాలయ్య నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా కార్లు, జీపులతో ర్యాలీగా వెళ్లి సినిమా చూసి వస్తారు. అఖండ సినిమా రిలీజ్ సమయంలో అయితే డల్లాస్ బాలయ్య ఫాన్స్, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హంగామా జరుగుతుందో అంతకన్నా ఎక్కువే చేసారు. మరి ఈసారి సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాని ఏ రేంజులో సెలబ్రేట్ చేస్తారో చూడాలి.
Also Read
- Ranabaali Postpone : విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్ట్‌పోన్ అవుతుందా?
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
Dallas Aka Dallaspuram welcomes Holidays with #JaiBalayya Song
Patrons Njoing Jai Balayya song in a Restaurants DJ
All credits to @MusicThaman For the SENSATIONAL SONG ❤️💥🥁@geethasinger #Akhanda pic.twitter.com/DjeMdQQitA
— Nandamurifans.com (@Nandamurifans) December 24, 2022
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!