Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఓ సినిమా కోసం తొలిసారి కలం పట్టారు బాలయ్య. రచయితగా మారి కథను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య369 సినిమా సీక్వెల్ కోసం కథను రెడి చేస్తున్నారు బాలక్రిష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య క్రియేటివిటీ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. అయితే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
Read Also: Anushka Shetty: అనుష్క అభినయంలోని మహత్తు!
Also Read
ఇటీవల అన్ స్టాపబుల్ షోలో కొన్ని ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన `ఒకే ఒక జీవితం` సినిమా గురించి ప్రస్తావిస్తూ.. `ఆదిత్య 369` గుర్తొచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా `ఆదిత్య 999 మ్యాక్స్` గురించి స్పందిస్తూ.. వచ్చే ఏడాదే ప్రారంభిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. `ఆదిత్య 369`కి దర్శకత్వం వహించిన సింగీతమే ఆ బాధ్యతలు తీసుకుంటారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారు. అయితే సీనియర్ కి అవకాశం ఇవ్వడం కన్నా ఇప్పటి దర్శకులు..అందులోనూ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న దర్శకుడికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఓ సందర్భంలో అన్నారు. అయితే వచ్చే ఏడాది బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా ప్రారంభించాలి. అలాగే 109వ సినిమాకి సంబంధించి చర్చలు వేగంగా జరుగుతున్నాయి. మరి వీటన్నింటి నడుమ ఆదిత్య `999 మ్యాక్స్ నెంబర్` ఏదై ఉంటుందో వేచి చూడాలి.
Read Also: Sreemukhi: బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి.. దేవుడా హీరోయిన్లకు మించి చూపిస్తుందే
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?