నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. సింహ, లెజెండ్ చిత్రాల తరువాత వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అంచనాలను మించి నేడు విడుదలైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని కలక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇక అఖండ భారీ విజయాన్ని అటు అభిమానులే కాకుండా ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి…
చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన బాలయ్య కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు… మీడియా ముందుకు వచ్చిన బాలయ్య కుటుంబం… వైసీపీపై ఫైర్ అయింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ అస్సాసినేషన్ మంచిదికాదని మండిపడ్డారు బాలయ్య. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆగ్రహించారు బాలకృష్ణ. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్ని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. ఇకనైనా వైసీపీ తన పద్దతిని మార్చుకోవాలన్నారు. మీరు మారక…
పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారిదే పైచేయి. అంతకు ముందు, ఆ తరువాత ఎందరు పౌరాణిక చిత్రాలు తీసి విజయాలు సాధించినా, పురాణగాథలతో తెరకెక్కిన తెలుగువారి చిత్రాల ముందు వెలవెల బోయాయనే చెప్పాలి. ఇక మన తెలుగు చిత్రసీమ పౌరాణిక చిత్రాలలో నిస్సందేహంగా ‘శ్రీలలితా శివజ్యోతి’ వారి పంచవర్ణ చిత్రం ‘లవకుశ’ అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ 1963 మార్చి 29న వెలుగు చూసింది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ‘లవకుశ’ చరిత్ర…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ చిత్రంలో నటించాల్సి ఉంది. బాలకృష్ణ నటిస్తున్న ఈ 107వ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 10.26 నిమిషాలకు సినిమాను ప్రారంభిస్తున్నట్టు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలిపారు. ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని, బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్”. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి ఆహా సిద్ధంగా ఉంది. మొదటి ఎపిసోడ్‌కు మంచు మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్నీ ఇటీవల విడుదలైన ప్రోమోలో ప్రకటించారు. అయితే పేరుకు తగ్గట్టుగానే షో ఉన్నట్టుగా ప్రోమో చూస్తే అన్పించింది. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలతో సరిపెట్టేయకుండా వివాదాస్పద ప్రశ్నలను సైతం ఈ షోలో బాలయ్య ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్…
వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య ఓ సినిమాలు చెప్పిన డైలాగ్‌కు అనువధించినట్లుగానే ప్రస్తుతం యూట్యూబ్‌లో పరిస్థితి నెలకొంది. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆహాలో నందమూరి బాలకృష్ణ (ఎన్‌బీకే) హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ప్రొమోను ఇటీవల యూట్యూబ్‌లో ఆహా విడుదల చేసింది. దీంతో టీవీల్లో ఇంటర్య్వూలకే ఆసక్తి కనబరచని బాలయ్య ఏకంగా హోస్ట్ చేస్తున్నారా..? ఎలా ఉందో చూడాలి మరీ..? అంటూనే చూసేస్తున్నారు.…
విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ “లైగర్” సెట్ ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు…
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి “అఖండ”. ఈ భారీ యాక్షన్ డ్రామాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. “సింహా”, “లెజెండ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ దర్శకుడు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ. తాజా సమాచారం ప్రకారం “అఖండ” చిత్రీకరణ పూర్తయింది. 10 రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ చేసేశారు. స్టంట్ కో-ఆర్డినేటర్ స్టన్ సిల్వా…