జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. కొన్ని దశాబ్దాలుగా అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు బాలయ్య. ఎన్నో సంవత్సరాలు ఆయన సినిమా షూటింగ్ లోనే ఈ వేడుకను జరుపుకునే వారు. రాష్ట్రంలోనే కాదు రాష్ట్రేతర ప్రాంతంలో బాలకృష్ణ ఉన్నా… పుట్టినరోజును ఆయనను కలిసి, అభినందించి రావడం అనేది అభిమానులుకు ఆనవాయితీగా మారిపోయింది. అయితే కరోనా సమయంలో అలాంటి పనులను చేయవద్దంటూ బాలకృష్ణ హితవు పలుకుతూ ఓ సందేశాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా అభిమానులకు తెలియచేశారు.…
కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కుదేలయింది. ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవడంతో పాటు పూర్తయిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ పరిస్థితి చక్కబడిన తర్వాతే సినిమాల విడుదల అంటున్నారు. అలా అందరికీ అనువైన సీజన్ గా దసరా కనిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి పలువురు బడా స్టార్స్ సినిమాలు సందడి చేస్తాయంటున్నారు. ప్రత్యేకించి చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలు దసరాకే వస్తాయని టాక్.…