Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమైంది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు 7000 మందికి పైగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షల్లో ప్రజలు ఇప్పటికే అయోధ్యకు వెళ్లే మార్గాల్లో ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం గంట పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది.
Mohan Babu about Ayodhya Ram Mandir Pranaprathistha: జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం కూడా పంపింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డా.మోహన్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ……
Ayodhya: అయోధ్యతో జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరోవైపు దేశంలోని పలు రంగాలకు చెందిన ముఖ్యులతో సహా సాధువులు 7000 పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు, యూపీ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Ayodhya Ram Temple: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులు, రామ భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు, లక్షల మంది ప్రజల మధ్య రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోంది. ఈ మేరకు యూపీ సర్కార్‌తో పాటు సెంట్రల్ భద్రతా ఏజెన్సీలు అన్నీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి.
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సన్నాహాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలో కొలువుదీరే బాలరాముడికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుంచి కానుకలు భారీగా వస్తున్నాయి.
KCR: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం భారతీయుల కలను సాకారం చేయనుంది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగబోతుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రవేశ పాస్‌లను జారీ చేసింది. ఎంట్రీ పాస్‌లో క్యూఆర్ కోడ్ ఉంది.