Ayodhya: అయోధ్యతో జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరోవైపు దేశంలోని పలు రంగాలకు చెందిన ముఖ్యులతో సహా సాధువులు 7000 పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు, యూపీ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Read Also: Ayodhya Ram Temple: రామమందిర నిర్మాణంలో ఇనుము, ఉక్కు ఉపయోగించలేదు.. ఎందుకో తెలుసా..?
ఇదిలా ఉంటే కొన్ని ఉగ్రసంస్థలు అయోధ్య వేడుక నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించారు. తాజాగా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కూడా ఇలాంటి బెదిరింపులకే పాల్పడింది. బాబ్రీ మసీదు ఘటనను ఉద్దేశిస్తూ భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేసింది.
ఈ నేపథ్యంతో రామ మందిర వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. వీవీఐపీలు అయోధ్య వస్తుండటంతో యూపీ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఉగ్రవాదుల కదలికలపై కన్నేసింది. ఇటీవల ముగ్గురు ఖలిస్తానీ సానుభూతిపరుల్ని అరెస్ట్ చేసింది. శుక్రవారం ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని హత్య చేస్తామని బెదిరించాడు.