ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్‌పీ), పోలీసు సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.
అయోధ్య నగరమంతటా పోలీసులు పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. అలాగే, ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇవాళ అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ గత శనివారం ఢిల్లీ ఎయిమ్స్ జారీ చేసిన మెమోరాండంను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
Ram Mandir : 500ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు తన కొత్త, గొప్ప రాజభవనంలో నివసించబోతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, సంత్ సమాజ్, వీవీఐపీల సమక్షంలో రాంలాలా శ్రీవిగ్రహానికి సంబంధించిన చారిత్రాత్మక ఆచారం జరగనుంది.
Swami Avimukteshwaranand: రామ మందిర ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. హిందువులను జాగృతం చేయడం చిన్న విషయం కాదని, అది ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ఇతనే కొన్ని రోజుల క్రితం రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉందని, తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.
World Record: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు మధ్యాహ్నం అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలు అట్టహాసంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మంది ప్రముఖులు అతిథులుగా, లక్షలాది మంది రామ భక్తులు ఈ వేడుక కోసం వస్తున్నారు.
Ram Mandir: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది. హిందువులు, రామభక్తుల శతాబ్ధాల కోరిక రేపటితో నెరవేవబోతోంది. రేపు(జనవరి22)న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో ఆలయ ప్రారంభం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది.
Ram Mandir: రామ మందిర వేడుకకు యావత్ దేశం సిద్ధమైంది. రేపు జరిగే కార్యక్రమం కోసం ప్రజలంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ సర్కార్తో పాటు కేంద్ర భద్రత ఏజెన్సీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఎజెన్సీలు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్, ఏఐ కెమెరాలతో భద్రతను పటిష్టం…
Ram Mandir Holiday: రేపు(జనవరి 22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం జరిగే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధాని ముఖ్యపోషకుడి హోదాలో ఈ కార్యక్రమానికి హాజవుతున్నారు. మరోవైపు దేశంలోని బిజినెస్, సినీ, స్పో్ర్ట్స్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో సహా…
Pawan Kalyan: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ అంతా సిద్ధమైంది. రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి 7000 మందికి పైగా అతిథులు వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర వేడుకకు బయలుదేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చేరుకున్నారు.