India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను…
ప్రధాని మోడీ మంగళవారం అయోధ్యలో పర్యటించనున్నారు. రామాలయంలో 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించనున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఈ జెండా ఆవిష్కరణ జరగనుంది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇది కూడా చదవండి: Off The Record: టీడీపీకి అత్యంత సమస్యాత్మకంగా ఆ నియోజకవర్గం..! 2020 ఆగస్టులో రామమందిరానికి ప్రధాని మోడీ శంకుస్థాపం చేశారు. ఇక 2024 జనవరి 22న రామమందిరం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. మళ్లీ ఇన్ని…
Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి.
అయోధ్యలోని రామమందిరానికి రక్షణ గోడ నిర్మించాలని భద్రతా నిపుణులు సూచించారు. దీంతో త్వరలో 4 కిలోమీటర్ల గోడతో కోట లాంటి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో గురువారం మరో అద్భుతం చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా రామమందిర మొదటి అంతస్థులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ‘శ్రీరామ నవమి’ 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతోన్న రెండో వేడుకలు ఇవి. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని…
ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 5, 2020-ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.