Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నదుల నుంచి కూడా జలాలను సేకరించారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి కూడా పవిత్ర జలాలు అయోధ్యకు చేరాయి. అయితే ఈ జలం నేరుగా పాక్ నుంచి భారత్‌కి రాలేదు. పుల్వామా అటాక్స్ తర్వాత భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తపాలా సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పవిత్ర జాలాలను యూకే ద్వారా అయోధ్యకు వచ్చినట్లు సేవ్ శారదా కమిటీ కాశ్మీర్ (SSCK) వ్యవస్థాపకుడు రవీందర్ పండిత చెప్పారు.
Read Also: Rashmika Mandanna deepfake: ఇన్‌స్టాలో ఫాలోవర్లను పెంచుకునేందుకే రష్మిక వీడియో..
పీఓకేలో ఉన్న పవిత్ర శారదా పీఠ్ కుండ్ నుంచి ఈ జలాలను సేకరించారు. ఈ జలాలను సేకరించింది తన్వీర్ అహ్మద్ అనే ముస్లిం వ్యక్తి. ఈ నీటిని అక్కడి నుంచి యూకేలో ఉన్న అతని కుమార్తె మఘ్రీబీకి పంపించారు. మఘ్రిబీ, ఆగస్ట్ 2023లో భారతదేశంలోని అహ్మదాబాద్‌కు వచ్చి కాశ్మీరీ పండిత్ కార్యకర్త సోనాల్ షేర్‌కి అందించారు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకున్నాయి. 1947 తర్వాత శారదా పీఠం పీఓకేలోకి వెళ్లిపోయింది.
Our Manjunath Sharma ji is in Ayodhya to handover holy water of Sharda kund from Sharda peeth PoK and many rivers of J&K in pran pratishtha of Ram mandir Ayodhya. Earlier we had sent pious soil & shila for shilanyas during foundation ceremony 3 years ago to Ram mandir.
Jai Siya… pic.twitter.com/3ftDu9opJD— Ravinder Pandita(Save Sharda) (@panditaAPMCC63) January 18, 2024