Jharkhand: కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
- జార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం
- కూలిన ఎయిర్ అంబులెన్స్
- ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
సోమవారం రాత్రి 7.11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చత్ర జిల్లాలోని సిమారియా సమీపంలో కూలిపోయింది. అయితే ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విమానం అదృశ్యమైందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ వెల్లడించారు. సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఇది కూలిపోయిందని ఆమె తెలిపారు. విమానంలో ఉన్న ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు SDPO శుభం ఖండేల్వాల్ పేర్కొన్నారు. కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా గుర్తించారు.
DGCA వెబ్‌సైట్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్ రెడ్‌బర్డ్ ఆరు విమానాలను కలిగి ఉంది. ఇందులో క్రాష్ అయిన విమానం కూడా ఉంది. రాంచీలోని దేవ్‌కమల్ హాస్పిటల్ CEO అనంత్ సిన్హా మాట్లాడుతూ.. ఎయిర్ అంబులెన్స్ రోగి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని చెప్పారు.
‘‘లాతేహార్ జిల్లాలోని చాంద్వా నివాసి సంజయ్ కుమార్ (41) అనే రోగి ఫిబ్రవరి 16న 65 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. రోగి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరాడు.’’ అని అనంత్ సిన్హా అన్నారు.
టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘‘ప్రమాదానికి వాతావరణం బాగోలేకపోవడమే కారణం కావచ్చు. కానీ కచ్చితమైన కారణం దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!