Asaduddin Owaisi: ముస్లింల నుంచి క్రమపద్ధతిలో బాబ్రీ మసీదుని లాక్కున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Read Also: Bhatti Vikramarka: ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే ఆగం అయ్యింది..
Also Read
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ముస్లింలు 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో నమాజ్ చేశారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన జీబీ పంత్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఆరోపించారు. ఆ సమయంలో అయోధ్య కలెక్టర్‌గా నాయర్ ఉండేవారని, ఆయన మసీదును మూసివేసి, అక్కడ పూజలు చేయడం ప్రారంభించారని అన్నారు. వీహెచ్‌పీ పుట్టినప్ప్పుడు రామమందిరం లేదని ఓవైసీ అన్నారు.
రామ మందిరం గురించి మహాత్మాగాంధీ ఎప్పుడూ ఏమీ ప్రస్తావించలేదని, చాలా క్రమపద్ధతిలో భారతీయ ముస్లింల నుంచి బాబ్రీని లక్కున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మెజారిటీ వర్గాలను సంతోషపెట్టే పనిలో నిమగ్నమయ్యాయని, మైనారిటీల గురించి మాట్లాడటం లేదని చెప్పారు. ఇండియా కూటమిలో ఉన్న ఆప్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతీ మంగళవారం సుందరాకాండ పారయణం, హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెబుతున్నారని, దీని గురించి ఎవరూ ఏమీ మాట్లాడటం లేదని, వారంతా మెజారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!