Nithyananda: అయోధ్య రామ మందిర వేడుకకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందని వివాదాస్పద గురువు నిత్యానంద వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. తనను తాను స్వయంప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద, పరారీలో ఉన్న అత్యాచార నిందితుడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. తనకు తాను కౌలాస దేశాన్ని సృష్టించుకుని, హిందూ మతానికి సుప్రీంగా చెప్పుకుంటున్నాడు.
Ram Mandir Event: జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకలో రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధానితో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులతో సహా 7000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.
Ayodhya security: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లోని ప్రముఖులు, సెలబ్రెటీలు, దౌత్యవేత్తలు, లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు.
DK Shivakumar: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక జరగనున్న జనవరి 22న ప్రభుత్వ సెలువు దినంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రోజు సెలవు ఇచ్చేదడి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థించారు.
Nirmala Sitharaman: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశం సిద్ధమవుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడులో బ్యాన్ చేశారంటూ ఆరోపించారు. స్థానిక మీడియ కథనాన్ని ఉటంకిస్తూ.. జనవరి 22న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(రేపు) సోమవారం అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అందుకు సంబంధించి దేశంలోని హిందూ సమాజంలో సంబరాల వాతావరణం నెలకొంది. కాగా.. అయోధ్యలో ప్రతిష్టంచనున్న బాలరాముడిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామభక్తులు తమ భక్తిని చాటుతూ వెలుగులోకి వస్తున్నారు. రామభక్తుడైన బాబా బద్రి.. మధ్యప్రదేశ్ దామోహ్‌లోని బటియాగఢ్ నుంచి బయలుదేరిన రామభక్తుడు బద్రీ బాబా.. ఐదు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు. అంతేకాదు.. అతను తన శిఖరం…
Mary Millben: యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు రేపు జరగబోయే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అయోధ్యంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు, సాధువులు 7000 మంది వరకు హాజరవుతున్నారు. లక్షల్లో ప్రజలు ఈ వేడుకను చూసేందుకు అయోధ్య చేరుకుంటున్నారు.
అయోధ్యలో రేపు మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తుంది.. ఈ కార్యక్రమం కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10. 20 గంటలకు అయోధ్య ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి 10. 55 నిమిషాలకు రామజన్మభూమి స్థలికి చేరుకుంటారు.
Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నదుల నుంచి కూడా జలాలను సేకరించారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి కూడా పవిత్ర జలాలు అయోధ్యకు చేరాయి. అయితే ఈ జలం నేరుగా పాక్ నుంచి భారత్‌కి రాలేదు.