Ram Mandir Ceremony: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సన్నాహాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలో కొలువుదీరే బాలరాముడికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుంచి కానుకలు భారీగా వస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కశ్మీర్, తమిళనాడు, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన కానుకలను రామాలయ ట్రస్ట్ సభ్యులకు అందించారు.
Read Also: Chiru: నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నా…
అయోధ్య రామాలయ నిర్మాణంపై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పుకొచ్చారు. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలవడానికి వచ్చి రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. ముస్లింలు సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమపువ్వును తనకు అందజేశారు అని అలోక్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Minister Seethakka: 25,28 న మంత్రులు మేడారం జాతరకు రావాలి..
కాగా, ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఆఫ్గనిస్థాన్ నుంచి కూడా ప్రత్యేక కానుక వచ్చిందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పుకొచ్చారు. ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో గల ‘కుబా’ నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని పేర్కొన్నారు. ఇక, తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాల తయారీదారులు శ్రీరాముని ఆలయ చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను అయోధ్య రామమందిరానికి పంపించారని అలోక్ కుమార్ వెల్లడించారు.