BYD Seal EV: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD మరో ఎలక్ట్రిక్ కార్ మోడల్‌ని భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమువుతోంది. ఎలక్ట్రిక్ సెడాన్ కార్ బీవైడీ సీల్‌ని మార్చి 5న భారత్‌లో విడుదల చేయబోతోంది. దీనికి ముందు ఇండియాలో BYDకి రెండు ఎలక్ట్రిక్ మోడళ్ల ఉన్నాయి. BYD e6 ఎలక్ట్రిక్ MPVతో సహా BYD ఆటో.3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి.
Nexon iCNG: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా పాసింజర్ వెహికల్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వెర్షన్లలో కార్లను విడుదల చేస్తోంది. ఇతర ఆటోమేకర్ ఇలా చేయలేకపోతున్నాయి. ఇప్పటికే ఈవీ కార్లలో టాటా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్ ఈవీ వాహనాలు ఉండగా.. త్వరలో హారియర్ ఈవీ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
Maruti Suzuki: దేశంలో అగ్రశ్రేణి కార్ మేకర్ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. తన అన్ని కార్ మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. 0.45 శాతం ధరల్ని పెంచింది. కార్ల డిమాండ్ మందగించిస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వస్తువుల ధరల కారణంగా జనవరి నుంచి ధరలు పెంచాలని యోచిస్తు్న్నట్లు మారుతీ 2023 చివర్లో ప్రకటించింది. ఒక్క మారుతీనే కాకుండా మిగతా కార్ కంపెనీలు కూడా ఇదే తరహాలో…
Mahindra XUV700: భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్న కార్లలో మహీంద్రా XUV700 ఒకటి. తాజాగా 2024 మహీంద్రా XUV700 SUVని కంపెనీ ఈ రోజు లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే లుక్స్, ఫీచర్ల పరంగా మరింత స్టైలిష్‌గా వస్తోంది. ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్‌లో అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. కొత్తగా నాపోలి బ్లాక్ కలర్ ఛాయిస్ కూడా ఉంది. భారత్‌లో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో మహీంద్రా XUV700 ఒకటి. 2023లో మహీంద్రా XUV700 కార్ 74,434 యూనిట్లు అమ్ముడయ్యాయి.…
Car Sales: భారతీయులు కార్‌లను తెగ కొనేస్తున్నారు. 2023 కార్ల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో తొలిసారిగా గతేడాది 40 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్(పీవీ)అమ్ముడయ్యాయి. ఈ మార్క్‌ని చేరుకోవడం భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే తొలిసారి. పాసింజర్ వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే.. 2022(కాలెండర్ ఇయర్) 37,92,000 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2023( కాలెండర్ ఇయర్)లో 41,08,000 పాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏకంగా 8.33 శాతం విక్రయం పెరిగింది.
2024 Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఈ నెలలో ఆవిష్కరించబడింది. గతంలోని సోనెట్‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్ల, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం మార్కె్ట్‌లో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీపడనుంది.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. తినడానికి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుల కోసం విదేశాల చుట్టూ తిరగడమే అక్కడి రాజకీయ నాయకులు, అధికారులకు నిత్యకృత్యమైంది. విద్యుత్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిపై విపరీతంగా పన్నులు పెంచింది అక్కడి ప్రభుత్వం. ఇదిలా ఉంటే అక్కడి ఆటోమొబైల్స్ పరిశ్రమ కూడా దెబ్బతింది.
Car prices hike: కొత్త కార్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కార్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి…
Kia Sonet facelift: కియా ఇండియా నుంచి కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా నుంచి సోనెట్ కూడా తన ప్రత్యర్థులకు ధీటుగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ ఉండటంతో దీన్ని తట్టుకునేందుకు కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. డిసెంబర్ 14న కొత్త సోనెట్‌ని ఆవిష్కరించనున్నారు. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14న ఆవిష్కరించబడుతుంది.