BYD Seal EV: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD మరో ఎలక్ట్రిక్ కార్ మోడల్‌ని భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమువుతోంది. ఎలక్ట్రిక్ సెడాన్ కార్ బీవైడీ సీల్‌ని మార్చి 5న భారత్‌లో విడుదల చేయబోతోంది. దీనికి ముందు ఇండియాలో BYDకి రెండు ఎలక్ట్రిక్ మోడళ్ల ఉన్నాయి. BYD e6 ఎలక్ట్రిక్ MPVతో సహా BYD ఆటో.3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి.
Read Also: Jaya Prada: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద “పరారీ”లో ఉన్నట్లు ప్రకటించిన కోర్టు..
బీవైడీ సీల్ కారు పూర్తిగా కంప్లీట్ బిల్ట్-అప్(సీబీయూ) ద్వారా భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. దీని ధర రూ. 50 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉండనుంది. దీనికి ప్రత్యర్థిగా హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఉంది. బీవైడీ సీల్ కారు 230 హెచ్‌పీ పవర్‌లో 360 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో వస్తోంది. 82.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
బీవైడీ సీల్ఈవీ ఒక్క ఛార్జింగ్‌తో ఏకంగా 570 కి.మీ రేంజ్ ఇవ్వనుంది. 150kW ఛార్జర్‌ని ఉపయోగించి సుమారు 37 నిమిషాల 10-80% ఛార్జ్ చేయవచ్చు. 11kW AC ఛార్జర్‌తో 8.6 గంటల్లో 0-100% ఛార్జ్ చేయవచ్చు. ఎంట్రీ లెవల్ కారులో రేర్ వీల్ డ్రైవ్(RWD) వేరియంట్ ఉండే అవకాశం ఉంది, 520 కి.మీ పరిధిలో ఆల్ వీల్ డ్రైవ్(AWD) వేరియంట్‌ని కలిగి ఉండొచ్చు.