Maruti Suzuki Jimny: ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో మహీంద్రా థార్ తన సత్తాను చాటుకుంది. అయితే థార్‌కి పోటీగా మారుతి సుజుకి జమ్నీతో మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. థార్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా జిమ్నిని తీర్చిదిద్దింది. 5-డోర్ వాహనంగా జిమ్ని రావడం చాలా మందిని ఆకర్షింది. ఆఫ్-రోడర్‌గా, ఫ్యామిలీ కార్‌గా వినియోగించుకునేందు జిమ్ని మంచి ఆఫ్షన్‌గా మారింది. దీంతో పాటు సగటు ఇండియన్ కోరుకునే మైలేజ్ విషయంలో కూడా జమ్నిని మారుతి సుజుకీ…
Tesla: భారతదేశంలోకి ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం, బిలియన్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే ఏడాది భారత్ లోకి టెస్లా కార్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి చర్చలు తుదిదశకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు భారత్ లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర లేదా తమిళనాడు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
Volkswagen Taigun Sound Edition: జర్మనీ ఆటోమేకర్ వోక్స్‌వ్యాగన్ తన కార్లతో ఇండియన్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించింది. ముఖ్యంగా వోక్స్‌వ్యాగన్ తన ఎస్‌యూవీ టైగున్‌తో మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న కాంపాక్ట్ XUVలో విభాగంలో గట్టి పోటీనిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది.
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా భారత్‌లో ఎంట్రీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలోకి టెస్లా కార్లను దిగుమతి చేసుకునే దిశగా భారత ప్రభుత్వం, టెస్లా మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో రెండేళ్లలో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా సిద్ధమవుతోంది. భారత్‌లో కొత్త ప్లాంట్ కోసం టెస్లా ఏకంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఏదో ఒక రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.…
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ, ఎలాన్ మస్క్‌కి చెందిన ‘టెస్లా’ భారతదేశంలో అడుగుపెట్టేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే దీనిపై టెస్లా ప్రతినిధులు, భారత ప్రభుత్వంతో చాలా సార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా తన కార్లను దిగుమతి చేయబోతుందని తెలస్తోంది. మరో రెండేళ్లతో ఇక్కడ టెస్లా తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి పలు కార్ల కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కార్లు కొనేవారే కరువయ్యారు. సప్లై చైన్‌లో అంతరాలు, తక్కువ డిమాండ్ వల్ల ప్యాసింజర్ కార్ల పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది.
Hyundai: కొరియన్ కార్ మేకర్ హ్యుందాయ్ రికార్డ్ సేల్స్‌తో దూసుకుపోతోంది. కంపెనీ ప్రారంభమైన తర్వాత ఈ సెప్టెంబర్ లోనే రికార్డు అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో కార్ల అమ్మకాల్లో పెరుగుదల ఓవరాల్‌గా హ్యుందాయ్ కంపెనీకి ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎస్‌యూవీ పోర్టుఫోలియోలో ఎక్స్‌టర్, వెన్యూ, క్రేటా, అల్కజర్, టక్సన్ కార్ మోడల్స్ ఉన్నాయి.
దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతరం కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో సందడి చేస్తోంది. రానున్న రోజుల్లో దేశీయ విపణిలోకి అనేక కొత్త కార్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి.
Nitin Gadkari: కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయబోదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. అక్టోబర్ 2023 నుంచి 6 ఎయిర్‌బ్యాగుల్ని తప్పనిసరి చేసే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని గతేడాది ప్రభుత్వం ప్రతిపాదించింది.
పెరుగుతున్న కనెక్టివిటీ, సాంకేతిక పురోగమనాల యుగంలో స్మార్ట్ కార్లు పెరిగిపోతున్నాయి. అధునాతన ఫీచర్లతో వినియోగదారులను స్మార్ట్ కార్లు ఆకట్టుకుంటున్నాయి. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో మీ వాహనమే మీపై గూఢచర్యం చేస్తూ, మీ వ్యక్తిగత జీవితంతో సహా ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉండవచ్చు.