Maruti Suzuki: దేశంలో అగ్రశ్రేణి కార్ మేకర్ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. తన అన్ని కార్ మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. 0.45 శాతం ధరల్ని పెంచింది. కార్ల డిమాండ్ మందగించిస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వస్తువుల ధరల కారణంగా జనవరి నుంచి ధరలు పెంచాలని యోచిస్తు్న్నట్లు మారుతీ 2023 చివర్లో ప్రకటించింది. ఒక్క మారుతీనే కాకుండా మిగతా కార్ కంపెనీలు కూడా ఇదే తరహాలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Read Also: Rahul Gandhi: రామ మందిర ప్రారంభోత్సవం ‘మోడీ ఫంక్షన్’.. అందుకే మేం వెళ్లడం లేదు..
జపాన్‌కి చెందిన సుజుకీ మోటార్స్ యాజమాన్యం చిన్న కార్ల విభాగంలో తక్కువ అమ్మకాలతో పోరాడుతోంది. గత ఆర్థిక సంవత్సరం కోవిడ్ కారణంగా పెరిగిన డిమాండ్‌తో అమ్మకాలు పెరిగాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం మధ్య సింగిల్ డిజిట్స్‌కి పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది జనవరిలో మారుతీ సుజుకీ మొత్తం కార్ లైనప్‌లో సగటున 1.1 ధరలను పెంచింది. ఇది తాజాగా ప్రతిపాదించిన పెంపు కన్నా రెట్టింపు. ఏప్రిల్-డిసెంబర్ నుంచి మారుతి మొత్తం అమ్మకాల్లో 8.5 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇది 26 శాతం పెరుగుదల కన్నా తక్కువ. భారత వాహన తయారీదారులు ప్రతీ ఏడాది కార్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇచ్చి ధరల్ని తగ్గించి కస్టమర్లను ఆకర్షించిన తర్వాత జనవరిలో ధరల్ని పెంచుతారు.