Mahindra XUV700: భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్న కార్లలో మహీంద్రా XUV700 ఒకటి. తాజాగా 2024 మహీంద్రా XUV700 SUVని కంపెనీ ఈ రోజు లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే లుక్స్, ఫీచర్ల పరంగా మరింత స్టైలిష్‌గా వస్తోంది. ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్‌లో అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. కొత్తగా నాపోలి బ్లాక్ కలర్ ఛాయిస్ కూడా ఉంది. భారత్‌లో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో మహీంద్రా XUV700 ఒకటి. 2023లో మహీంద్రా XUV700 కార్ 74,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆగస్ట్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, XUV700 140,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది.
బుకింగ్స్:
2024 XUV700 బుకింగ్స్ జనవరి 15 నుంచే అందుబాటులోకి వచ్చాయి. డెమో వెహికిల్స్ జనవరి 25 నుంచి డీలర్‌షిప్‌లకు చేరుకుంటాయి. గతంలో ఈ కార్లు కావాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అయితే వేగంగా కస్టమర్ డెలివరీల కోసం మహీంద్రా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది.
Read Also: Ram Bhajan: కాశ్మీరీ ముస్లిం యువతి ఎంత చక్కగా “రామ్ భజన్” పాడుతుందో చూడండి.. వీడియో వైరల్..
ఫీచర్స్:
మహీంద్రా XUV700 కొత్త నాపోలి బ్లాక్ కలర్ ఆప్షన్‌తో వస్తోంది. బ్లాక్ రూఫ్, క్రోమ్ యాక్సెంట్‌లతో కూడిన బ్లాక్ గ్రిల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. AX7, AX7L వేరియంట్‌లలో డార్క్ క్రోమ్ ఎయిర్ వెంట్స్, కన్సోల్ బెజెల్ అప్డేట్స్ తో వస్తోంది.
2024 మహీంద్రా XUV700 యొక్క Adrenox సూట్ ఇప్పుడు 13 అదనపు ఫీచర్లను కలిగి ఉంది. దీనితో మొత్తం 83 కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఫర్మ్‌వేర్ ఓవర్-ది-ఎయిర్ (FOTA) కాపబిలిటీ, ఆస్క్ మహీంద్రా ఉన్నాయి. వెహికిల్ సెఫ్టీ, రిమోట్ ఫంక్షన్స్, థర్డ్ పార్టీ యాప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. వీటిని యాక్సెస్ చేసేందుకు Adrenox సబ్‌స్క్రిప్షన్ అవసరం.
2024 మహీంద్రా XUV700 ధర (ఎక్స్ షోరూం):
MX – రూ 13.99 లక్షలు
AX3 – రూ. 16.39 లక్షలు
AX5 – రూ. 17.69 లక్షలు
AX7 – రూ. 21.29 లక్షలు
AX7L – రూ. 23.99 లక్షలు
2024 మహీంద్రా XUV700 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. పెట్రోల్ ఇంజన్ 200 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. డిజిల్ వేరింట్ 155 బీహెచ్‌పీ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్‌లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. ఆల్ వీట్ డ్రైవ్(AWD) కూడా ఆప్షనల్‌గా ఉంది.