Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. తినడానికి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుల కోసం విదేశాల చుట్టూ తిరగడమే అక్కడి రాజకీయ నాయకులు, అధికారులకు నిత్యకృత్యమైంది. విద్యుత్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిపై విపరీతంగా పన్నులు పెంచింది అక్కడి ప్రభుత్వం. ఇదిలా ఉంటే అక్కడి ఆటోమొబైల్స్ పరిశ్రమ కూడా దెబ్బతింది.
Read Also: Rajasthan: మైనర్ బాలికను పెళ్లి చేసుకుని.. గదిలో బంధించి.. పది రోజులుగా అత్యాచారం..
నవంబర్ నెలలో పాక్ వ్యాప్తంగా కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 15,432 కార్లు అమ్ముడయ్యాయి. పాకిస్తాన్‌లో ఆటోమొబైల్స్ పరిశ్రమ దెబ్బతినడానికి ఆర్థిక సంక్షోభమే కారణం. కార్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు ఇలాంటి సమస్యలతో అక్కడి పరిశ్రమ కుంటుపడింది.
పాక్ సుజుకి ఏడాది అమ్మకాలు 72 శాతం క్షీణించాయి. ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ 71 క్షీణత నమోదు చేశాయి. హోండా అట్లాస్ కార్ల అమ్మకాలు 49 శాతం క్షీణించాయి. ఇప్పటికే టయోటా, సుజుకీ, హోండాతో సహా పాకిస్తాన్‌లోని తమ తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపేశాయి. ఇదే ఇండియా విషయానికి వస్తే..కేవలం 10 గంటల్లోనే పాకిస్తాన్ నెలలో అమ్మే కార్లను అమ్ముతోంది. ఒక్క నవంబర్ నెలలోనే ఇండియాలో 3.6 లక్షల కార్లను అమ్మారు. అంతటే దాదాపుగా ఒక గంటకు 500 కార్ల అమ్మకం జరిగినట్లు ఎఫ్ఏడీఏ రిపోర్ట్ వెల్లడించింది.