Car Sales: భారతీయులు కార్‌లను తెగ కొనేస్తున్నారు. 2023 కార్ల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో తొలిసారిగా గతేడాది 40 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్(పీవీ)అమ్ముడయ్యాయి. ఈ మార్క్‌ని చేరుకోవడం భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే తొలిసారి. పాసింజర్ వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే.. 2022(కాలెండర్ ఇయర్) 37,92,000 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2023( కాలెండర్ ఇయర్)లో 41,08,000 పాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏకంగా 8.33 శాతం విక్రయం పెరిగింది.
Read Also: Turky : ఇజ్రాయెల్ పై టర్కీ భారీ చర్య.. 33మంది మొస్సాద్ గూఢచారుల అరెస్టు
2023లో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్(SUV) విభాగంలో మార్కెట్ లో 48.7 శాతంతో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత హ్యాచ్‌బ్యాక్ విభాగం 30 శాతంతో రెండోస్థానంలో ఉండగా, సెడాన్ విభాగం 9.4 శాతం, ఎంపీవీ కార్లు 8.7 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022 నుంచి 2023కి పోల్చి చూస్తే SUV సెగ్మెంట్ వాటా 42 శాతం పెరిగింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ మరియు సెడాన్ సెగ్మెంట్ వరుసగా 34.8 శాతం మరియు 11 శాతం తగ్గాయి. ముఖ్యంగా SUV సెగ్మెంట్ వాహనాలే అధిక వృద్ధికి కారణమైంది.
మరోసారి కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకీ సత్తా చాటింది. ఇండియాలో అమ్ముడవుతున్న టాప్-10 కార్లలో 7 కార్లు ఈ కంపెనీవే. స్విఫ్ట్, వ్యాగన్-ఆర్, బ్రెజ్జా మోడల్స్ ఈ కార్ల జాబితాలో ఉన్నాయి. మారుతి సుజుకీ ఏకంగా 17 లక్షల కార్లను విక్రయించగా.. హ్యుందాయ్ 6,02,111, టాటా మోటార్స్ 5,50,838, మహీంద్రా 4,33,172 యూనిట్లను విక్రయించాయి.