Tesla: భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్.. స్థలం కోసం కంపెనీ అధ్యయనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా సిద్ధమైంది. ప్రతిపాదిత 2-3 బిలియన్ డాలర్లతో దేశంలో ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందు కోసం దేశంలోని పలు ప్రాంతాలను టెస్లా బృందం అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది. టెస్లా ప్రధాన మార్కెట్లైన అమెరికా, చైనాలో ఈవీల డిమాండ్ మందగిస్తున్న తరుణంలో, ఇప్పుడిప్పుడే ఈవీ మార్కెట్‌లో ఎదుగుతున్న భారత్‌పై టెస్లా దృష్టిసారించింది. ఆటో మాన్యుఫాక్చర్ హబ్‌లుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలపై టెస్లా దృష్టి సారింస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, టెస్లా మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు.
Read Also: Nitish Kumar: “ఇక శాశ్వతంగా ఎన్డీయేలోనే ఉంటా”.. ప్రధాని ముందు నితీష్ కుమార్ వ్యాఖ్యలు..
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్‌లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్‌లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
గతంలో చైనా నుంచి భారత్‌కి కార్లను దిగుమతి చేయాలని టెస్లా భావించింది. అయితే, భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కట్టుబడి ఉంది. ఇండియాలోనే తయారైతేనే తప్పా కార్ల సంకాలను తగ్గించే ప్రసక్తే లేదని చెప్పింది. అయితే, కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు దేశంలో కనీసం 500 మిలియన్లు డాలర్లు పెట్టుబడి పెట్టి మూడేళ్లలోపు ఉత్పత్తిని ప్రారంభిస్తే దిగుమతి పన్నుల్ని తగ్గిస్తామని కేంద్రం కొత్త విధానం తీసుకువచ్చింది. కొత్త భారత విధానం ప్రకారం, కంపెనీలు తక్కువ పన్ను రేటుతో సంవత్సరానికి 8,000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే టెస్లా కార్ల ఎంట్రీని భారతదేశానికి చెందిన కార్ మేకర్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2023లో భారతదేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో EVలు 2% ఉన్నాయి, ప్రభుత్వం 2030 నాటికి 30% లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు జర్మనీ నుంచి భారత్‌కి టెస్లా కార్లు దిగుమతి అయ్యే అవకాశం కనిపిస్తోంది. జర్మనీలో ఇప్పటికే టెస్లా రైట్ హ్యాండ్ డ్రైవ్(RHD) కార్ల తయారీ ప్రారంభమైంది.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!