బ్రిస్బేన్‌లో పరుగుల వరద పారిస్తాడనుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు. జోస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో.. కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు.
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది.
డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష మందికి పైగా ఉండగా.. మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడే మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. అడిలైడ్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై భారీ ప్రభావం చూపింది. భారత్ నుంచి నంబర్-1 టాప్ ప్లేస్‌ను కంగారూలు కొల్లగొట్టారు. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.
Travis Head: రెండో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టులో బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానం కోల్పోనున్నాడని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీనికి ఆతిథ్య టీమ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రియాక్ట్ అయ్యారు. సన్నీ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గాయపడటం జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో స్మిత్ గాయపడ్డాడు. నెట్స్‌లో మార్నస్ లబుషేన్ వేసిన త్రో పడుతుండగా అతని వేలికి గాయమైంది.
Husband Murdered By Wife: ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఆపై, అతని శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలలో విసిరివేసింది. సిడ్నీలో 53 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ నిర్మిన్ నుఫాల్ తన 62 ఏళ్ల భర్త మమ్‌దౌహ్ ఇమాద్ ను హత్య చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మే 3వ తేదీన పశ్చిమ సిడ్నీలోని గ్రీన్కర్ హోమ్‌లో భార్య నౌఫల్ తన భర్తను…