Sydney Test: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. అలాగే, ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి టీమిండియా నిష్క్రమించినట్లైంది. ఇక, మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన 162 పరుగుల స్వల్ప టార్గెట్ ను 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరీస్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
Read Also: Bheems Ceciroleo : మెగాస్టార్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్
అయితే, ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసేశారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు భారత్ ప్రయత్నించింది. కాగా టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 రన్స్ కే ఆలౌటైంది. 141 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను స్టార్ట్ చేసిన భారత్.. అదనంగా కేవలం 16 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది. ఇక, గాయంతో రెండో రోజు మైదానం వీడిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. ఈరోజు బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు.
Ready to defend their World Test Championship mace 👊
Australia qualify for the #WTC25 Final at Lord's 🏏
More 👉 https://t.co/EanY9jFouE pic.twitter.com/xcpTrBOsB8
— ICC (@ICC) January 5, 2025