ICC WTC Points Table: డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతాలు చేసిందనే చెప్పాలి. ఏకంగా రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దెబ్బతో దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పాటు భారతదేశానికి డేంజర్ అలెర్ట్ ని పెంచింది. Also Read:…
ఆస్ట్రేలియా మినిస్టర్ టిమ్ వాట్స్ విరాట్ కోహ్లీని కలిసినప్పుడు జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విరాట్‌పై ఉన్న గౌరవంతోనే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తాను సపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు.
క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించరు. కొన్నిసార్లు బంతి తాకడం, జారి పడిపోవడం, పరుగెడుతుంటే నరాలు పట్టేయడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. 10 సంవత్సరాల క్రితం జరిగిన విషాద సంఘటన ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎంతో దు:ఖంలోకి నెడుతుంది.
Social Media: చిన్న పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఈరోజు (బుధవారం) ఆమోదం తెలిపింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ రికార్డులు బ్రేక్ కాగా.. ఇంకొన్ని రికార్డులు అలానే ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ఈ ట్రోఫీని భారత్ చేజిక్కించుకుంటుండటంతో.. ఆస్ట్రేలియా మాత్రం పోరాడుతూనే ఉంది. మరోవైపు.. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాలో కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.
ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ కు కూడా గాయపడ్డాడు.
రోజంతా అంటే 11 గంటలు దాదాపు నాలుగు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం ఈజీ అవుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఈ క్రమంలో 11 గంటలు బ్యాటింగ్ చేసే బ్యాటర్ విషయంలో గంభీర్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు. టాప్ -7లోని బ్యాటర్లంతా ఆడగలరు అని చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భాగంగా.. నవంబర్ 13న సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్.. ఆస్ట్రేలియాను సమం చేసింది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు 17-17 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించాయి.
IND vs AUS: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. చీలమండకు గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యప్రదేశ్‌తో జరిగే తమ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.…