AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్‌ను కోల్పోయింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను సెమీ-ఫైనల్స్‌కు దూరం కానున్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
ఛాపియన్ లాహోర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట ఆస్ట్రేలియా 43 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో 15 మంది సభ్యుల జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పలు మార్పులు చేసింది. గాయం కారణంగా…
రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు ఎవరనే దానిపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే చెరో రెండు సార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయని రిక్కీ పాటింగ్ అన్నారు.
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ మంచి ఆటతీరును ప్రదర్శించాడు. టీమిండియాపై నాలుగు ఇన్నింగ్స్‌లలో (60, 8, 23, 22) 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల ఘటనలతో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సామ్.. ఒక్క సిరీస్‌తో ఆస్ట్రేలియా అభిమానులకు క్రేజీ ప్లేయర్‌గా మారిపోయాడు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఆటోగ్రాఫ్ కోసం ఓ…
స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 3-1తో భారత జట్టును ఓడించింది. దీంతో కంగారూ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ.. ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ కు ఆగ్రహం తెప్పించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి భారత క్రికెట్ జట్టు- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది.