ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కానుంది. త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మరోవైపు ఈ ఏడాదంతా టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపబోతోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో…
మహిళల వన్డే ర్యాంకులను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టాప్-10 ర్యాంకుల్లో ఇటీవల వన్డే ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా మహిళలు డామినేట్ చేస్తున్నారు. ఈ జాబితాలో టాప్-10లో ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా మహిళలే ఉండటం విశేషం. ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాటర్ల ర్యాంకుల్లో టాప్-1లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలీస్సా హిలీ నిలిచింది. ఆమె ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీతో రాణించింది. ప్రపంచకప్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆమె 509…
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం…
క్రికెట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన సత్తా నిరూపించుకుంది. పురుషుల జట్టుతో తీసిపోని రీతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కూడా వరుసగా టైటిళ్లు సాధిస్తోంది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు భారీ…
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్…
పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.…
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57…
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ ఆడుతోంది భారత మహిళల జట్టు.. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న మిథాలీ సేన.. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.. ఇక, టాప్ 4లో స్థానం దక్కాలంటే మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్‌లో ముందుకు సాగాలంటే.. ఈ మ్యాచ్…
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన రావల్పిండి పిచ్‌కు ఐసీసీ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదేళ్లలో 5 డీమెరిట్ పాయింట్లు వస్తే 12 నెలల పాటు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వీల్లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆడిన తొలి టెస్టులో పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది. దీంతో పాకిస్థాన్…
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్ ఈనెల 4న థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో రోజుల తర్వాత వార్న్ డెడ్‌బాడీ ప్రత్యేక విమానం ద్వారా గురువారం నాడు థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకుంది. శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. థాయ్‌లాండ్‌లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్బోర్న్కు డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో షేన్‌వార్న్ మృతదేహాన్ని థాయ్ ప్రభుత్వం తరలించింది.…