IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…
మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశ్చర్యకరంగా బుమ్రాను తుది జట్టులోకి తీసుకోకుండా ఉమేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రానున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్…
Aaron Finch: ఆస్ట్రేలియా జట్టు వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ తనకు చివరిది అని అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే ఫించ్ వన్డే కెరీర్లో చివరిది కానుంది. అరోన్ ఫించ్ ఇప్పటివరకు 145 వన్డేలు ఆడి 5,041 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు…
Sean Abbott: ఆస్ట్రేలియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు నిలకడలేమిని ప్రదర్శిస్తోంది. జింబాబ్వే చేతిలో వన్డేలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గొప్ప ప్రదర్శనే చేసింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 195 పరుగులు మాత్రమే చేయగా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ బౌలర్ తన కెరీర్లోనే గొప్ప గణాంకాలను నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన…
AUS Vs ZIM: ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా పసికూనగానే మిగిలిపోయిన జింబాబ్వే ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఫార్మాట్లో అయినా జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైనప్పటికీ మూడో వన్డేలో జింబాబ్వే ఆటగాళ్లు తెగించి ఆడారు. దీంతో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా లాంటి మేటి…
మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
Gun firing At Canberra Airport: ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియాలో తుపాకీ కాల్పలు కలకలం రేపాయి. ఆదివారం దేశ రాజధాని కాన్బెర్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికుల చెక్ ఇన్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.