కామన్వెల్త్లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్లో భారత్ నుంచి పసిడి చేజారింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సూపర్ విక్టరీ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా రాణించి, భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (378) సునాయాసంగా చేధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఒక సరికొత్త రికార్డ్‌ని సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. తొలుత 1977లో పెర్త్ వేదికగా భారత్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా చేధించింది. ఇప్పటివరకూ…
ఏపీ సీఎం జగన్‌పై నటుడు అలీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం నాడు వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో నటుడు అలీ పాల్గొన్నారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు తమ కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ..…
17 ఓవర్లు ముగిసిపోయాయి.. శ్రీలంక స్కోరు 118/6.. మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లలో 59 పరుగులు చేయాలి.. ఇది దాదాపు అసాధ్యమైన ఫీట్.. కాబట్టి శ్రీలంక ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. శ్రీలంక అభిమానులు సైతం మెల్లగా మైదానాన్ని వదిలి వెళ్తున్నారు. అప్పుడు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54) తాండవం చేశాడు. ఆసీస్ బౌలర్లపై మెరుపు దాడికి దిగాడు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దిశగా బాదాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ…
ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అవ్వగా.. మంగళవారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక ఆటగాళ్ళు దారుణమైన ఆటతీరుని ప్రదర్శించడం పట్ల.. ఆ దేశ క్రికెట్ ప్రియులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 11.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. అది చూసి.. లంక కచ్ఛితంగా 200 పరుగుల మార్క్‌ని దాటేస్తుందని అంతా భావించారు. కానీ,…
ప్రముఖ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాలో ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్లో వైరల్ అయిన వీడియో కారణంగా ఆయన రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, దీంతో ఆ నేతకు రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020లో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అయితే…
ఆస్ట్రేలియాలో ఇటీవల ఫెడరల్ ఎన్నికల్లో వందలాది మంది అర్ధనగ్నంగా పాల్గొనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహిళలు స్విమ్‌సూట్ ధరించగా.. పురుషులు అండర్వేర్లో వెళ్లి ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే మహిళలు, పురుషులు ఇలా అర్ధనగ్నంగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఓ కారణముంది. ‘బడ్జీ స్మగ్లర్స్’ అనే బట్టల కంపెనీ అక్కడి ఓటర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. అండర్వేర్లో వెళ్లి ఓటేస్తూ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని తెలిపింది.…
ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారి ఎన్నికల్లో గెలుపొందడంతో… ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా 1.70 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ద్రవ్యోల్బణంలో దేశ వాసులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్థిక సాయం, సామాజిక…
ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించడంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. 46 ఏళ్ల వయసులోనే సైమండ్స్ మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు సైమండ్స్‌కు రోడ్డుప్రమాదం జరిగిన ప్రదేశంలోనే అతని సోదరి లూయిస్ ఓ భావోద్వేగ లేఖను రాసి ఉంచడం అందరినీ కలిచి వేస్తోంది. Read Also: Thomas Cup : చరిత్ర సృష్టించిన భారత జట్టుకు కోటి రూపాయల బహుమతి ‘చాలా త్వరగా అందనంత దూరంగా…
ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు…