ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించడంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. 46 ఏళ్ల వయసులోనే సైమండ్స్ మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు సైమండ్స్‌కు రోడ్డుప్రమాదం జరిగిన ప్రదేశంలోనే అతని సోదరి లూయిస్ ఓ భావోద్వేగ లేఖను రాసి ఉంచడం అందరినీ కలిచి వేస్తోంది.
Read Also:
Thomas Cup : చరిత్ర సృష్టించిన భారత జట్టుకు కోటి రూపాయల బహుమతి
‘చాలా త్వరగా అందనంత దూరంగా వెళ్లిపోయావు. ఆండ్రూ.. నీ మనసుకు శాంతి కలగాలి. మరో రోజు ఉన్నా, కనీసం మరో ఫోన్ కాల్ మాట్లాడినా బాగుండేదనిపిస్తోంది. నా గుండె పగిలింది. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ సైమండ్స్ సోదరి లూయిస్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సైమండ్స్ భార్య లారా కూడా సైమండ్స్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తాను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని, తన ఇద్దరు పిల్లల గురించి తాను ఆలోచిస్తున్నానని లారా వాపోయింది.