ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు చేయగా.. 198 వన్డేలు ఆడి 5,088 పరుగులు పూర్తి చేశాడు. అటు 14 టీ20ల ద్వారా 337 పరుగులు చేశాడు. సైమండ్స్ ఖాతాలో టెస్టుల్లో రెండు సెంచరీలతో పాటు 10 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో ఆరు సెంచరీలతో పాటు 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Ambati Rayudu: రిటైర్మెంట్ ట్వీట్‌తో షాక్.. ఆ తర్వాత ఇంకో ట్విస్ట్
కాగా సైమండ్స్ ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున బరిలోకి దిగాడు. మూడు సీజన్‌ల పాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత అతడిని వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఈ రెండు జట్ల తరఫున ఐపీఎల్‌లో మొత్తం సైమండ్స్ 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర పలకడంతోనే క్లార్క్‌తో తన ఫ్రెండ్‌షిప్ చెడిందని ఇటీవల సైమండ్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అటు టీమిండియా స్పిన్నర్ హర్భజన్‌తో సైమండ్స్‌కు మంకీ గేట్ వివాదం సంచలనం సృష్టించింది. సిడ్నీలో 2008లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో సైమండ్స్, హర్భజన్ సింగ్ మధ్య తలెత్తిన ఈ వివాదంలో… భజ్జీ తనను మంకీ అన్నాడని సైమండ్స్ ఆరోపించాడు. అయితే తాను మా..కీ అన్నానంటూ భజ్జీ వివరణ ఇచ్చినా.. హర్భజన్‌దే తప్పంటూ ఆసీస్ బోర్డు అతడిపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. నిషేధం ఎత్తివేయకపోతే టూర్ రద్దు చేసుకుంటామని కెప్టెన్ కుంబ్లే హెచ్చరించడంతో హర్భజన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ నిషేధం ఎత్తివేసింది.