ఆస్ట్రేలియాలో ఇటీవల ఫెడరల్ ఎన్నికల్లో వందలాది మంది అర్ధనగ్నంగా పాల్గొనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహిళలు స్విమ్‌సూట్ ధరించగా.. పురుషులు అండర్‌వేర్‌లో వెళ్లి ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే మహిళలు, పురుషులు ఇలా అర్ధనగ్నంగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఓ కారణముంది. ‘బడ్జీ స్మగ్లర్స్’ అనే బట్టల కంపెనీ అక్కడి ఓటర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. అండర్‌వేర్‌లో వెళ్లి ఓటేస్తూ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని తెలిపింది. దీంతో బడ్జీ స్మగ్లర్స్ కంపెనీ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ ఆఫర్ పొందడానికి అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా అండర్‌వేర్‌లలో వెళ్లి ఓట్లు వేసి ఫోటోలు దిగి సోషల్ మీడియలో షేర్ చేశారు.
కాగా 2007 తర్వాత తొలిసారిగా జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబర్ పార్టీ గెలుపొందింది. దీంతో ఆ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలు ఉన్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలను నిర్వహించారు. కరోనా దృష్ట్యా 1.7 కోట్ల మంది ఓటర్లలో 48 శాతానికి పైగా ప్రజలు ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగిలిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు.