WTC Final 2025: చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా.. 69 పరుగుల దూరంలోనే సఫారీ జట్టు..
- చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా..
- మార్‌క్రమ్ శతకం, బవుమా హాఫ్ సెంచరీ..
- విజయానికి 69 పరుగుల దూరంలోనే సఫారీ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final 2025: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా అడుగులు వేస్తుంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై మూడోరోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం 282 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన సౌతాఫ్రికామూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఐడెన్ మార్‌క్రమ్ (159 బంతుల్లో 11×4, 102 పరుగులు), బవుమా (121 బంతుల్లో 5×4 65 పరుగులు) జట్టును గెలుపు దిశగా తీసుకెళ్తున్నారు. దీంతో చరిత్రాత్మక విజయానికి దక్షిణాఫ్రికా జట్టు మరో 69 పరుగుల దూరంలో ఉంది. కాగా, అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 207 రన్స్ కి ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) రాణించాడు.
Read Also: Trump: ఇరాన్‌పై దాడులు సరైనవే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్దతు
Also Read
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
అయితే, లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు తొలుత తడబడింది. పేసర్ మిచెల్ స్టార్క్(2/53) బౌలింగ్ ధాటికి మూడో ఓవర్లోనే దక్షిణాఫ్రికా మొదటి వికెట్‌గా రికిల్‌టన్ (6) అవుట్ అయ్యాడు. దీంతో మార్‌క్రమ్, ముల్డర్ (27) నిలకడగా బ్యాటింగ్ చేస్తుండగా 70 పరుగుల వద్ద మరోసారి స్టార్కే.. ఆస్ట్రేలియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్‌స్టంప్ లైన్‌లో పడిన ఓ ఫుల్ బంతిని డ్రైవ్ చేయబోయిన ముల్డర్.. లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కాగా, రెండు వికెట్లు కోల్పోయినా మార్‌క్రమ్ మాత్రం సెంచరీ చేయగా.. మరోవైపు ఆరంభంలో బవుమా కొత ఇబ్బంది పడినా.. ఆ తర్వాత మాత్రం ఆసీస్ బౌలర్లకు ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఇక, ఎన్నాళ్లో నుంచో ఐసీసీ ప్రపంచ టోఫ్రీని దక్కించుకోవాలని చూస్తున్న దక్షిణాఫ్రికా విజయానికి మరో 69 పరుగుల దూరంలో నిలిచింది.
ఇక, లార్డ్స్ మైదానంలో 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టెస్ట్ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే సాధ్యం అయింది. 1984లో వెస్టిండీస్ 344 పరుగులను.. 2004లో ఇంగ్లాండ్ 282 పరుగులను.. 2022లో ఇంగ్లాండ్ 277 పరుగులను విజయవంతంగా ఛేదించింది. తాజాగా సౌతాఫ్రికా కూడా 282 రన్స్ టార్గెట్ చేధిస్తే.. దక్షిణాఫ్రికా ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరినట్లే.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!