WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?.. హేజిల్‌వుడ్‌పై జాన్సన్ ఫైర్!
- దేశం కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?
- జోష్ హేజిల్‌వుడ్‌పై మిచెల్ జాన్సన్ ఫైర్
- డబ్ల్యూటీసీ ఫైనల్లో నిరాశపర్చిన హేజిల్‌వుడ్
- ఐపీఎల్ 2025లో 22 వికెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌పై ఆ దేశానికే చెందిన మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ మండిపడ్డాడు. జాతీయ జట్టు కన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని ఫైర్ అయ్యాడు. గత కొన్నేళ్లలో హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమవుతోందని ఆరోపణలు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిన నేపథ్యలో జాన్సన్ స్పందించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా రాణించాడు. 22 వికెట్లతో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్ 2025 చివరి దశలో గాయపడ్డ హేజిల్‌వుడ్.. ఆ తర్వాత కోలుకున్నాడు. లీగ్ వాయిదా పడడంతో కోలుకున్న అతడు.. డబ్ల్యూటీసీ ఫైనల్ సమీపిస్తున్న దశలో ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ ఆడాడు. ఐపీఎల్ 2025లో ఆడడం, డబ్ల్యూటీసీ ఫైనల్లో నిరాశపర్చిన నేపథ్యంలో మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు.
Also Read
Also Read: Kommineni Srinivasa Rao: నేడు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల!
‘జోష్ హేజిల్‌వుడ్ జాతీయ జట్టు సన్నాహాల కంటే ఐపీఎల్ 2025లో పాల్గొనడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. గత కొన్నేళ్లలో హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ ఏమాత్రం బాగాలేదు. జాతీయ జట్టు సన్నాహల కన్నా.. ఆలస్యమైన ఐపీఎల్ కోసం తిరిగి వెళ్లడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిగ్ ఫోర్’ అయిన మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్‌లు ఒకప్పట్లా అద్భుతాలు చేస్తారని అనిపించట్లేదు. వీరికే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సీనియర్ ప్లేయర్స్ యాషెస్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని అనుకుంటుంటే.. ఆ భావన సరైందేనా అని చూడాలి. ఇక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెస్టు ఆటగాళ్లను ఎంచుకోవడం మంచిది’ అని క్రికెట్ ఆస్ట్రేలియాకు మిచెల్ జాన్సన్ సూచించాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!