WTC Final: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి తుది పోరు ప్రారంభం కానుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. కాగా, రెండేళ్ల పాటు హోరాహోరీగా సాగిన లీగ్ దశ తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్‌కు వచ్చాయి. సౌతాఫ్రికా ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో టేబుల్ టాపర్ గా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌లలో 67.54 పాయింట్ల శాతంతో ఫైనల్ బెర్తును దక్కించుకుంది.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఇక, లార్డ్స్‌లో జరగనున్న ఈ ఫైనల్, ఇరు జట్ల మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది అని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు. సరిగ్గా 113 సంవత్సరాల క్రితం, 1912లో ఈ రెండు జట్లు ‘క్రికెట్ మక్కా’గా పిలువబడే ఇంగ్లాండ్ లోని లార్డ్స్‌లో తటస్థ వేదికపై చివరి సారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఇది ఈ పోరుకు మరింత చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చే అవకాశం ఉంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కేవలం రెండు క్రికెట్ జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, 2018లో జరిగిన వివాదాస్పద ‘శాండ్‌పేపర్ గేట్’ ఉదంతం వంటి ఘటలను కూడా గుర్తు చేయనుంది. కాగా, ఇప్పుడు తటస్థ వేదికపై తమ మధ్య ఉన్న వైరుధ్యంతో కొత్త అధ్యాయాన్ని లిఖించే ఛాన్స్ ఆసీస్- సఫారీ జట్లకు లభించింది.
Read Also: Cargo Ship: కార్గో షిప్‌లో కొనసాగుతున్న పేలుళ్లు.. భారీగా మంటలు
అయితే, ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న.. నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా ఇరు జట్లకు శుభాకాంక్షలు చెప్పారు. దీనిని ‘అల్టిమేట్ టెస్ట్’ గా అభివర్ణించారు.. క్రికెట్ క్రీడలోని స్ఫూర్తిని, క్రీడా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వేదికలలో ఒకటైన లార్డ్స్‌లో ఈ మ్యాచ్ నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ భారీగా వస్తారని పేర్కొన్నారు.
Looking forward to an enthralling contest in the @ICC World Test Championship Final at Lord’s. Best of luck to both @ProteasMenCSA and @CricketAus in the Ultimate Test! pic.twitter.com/gSPJ8bgdFp
— Jay Shah (@JayShah) June 10, 2025